తమన్నాని ఆంటీ చేసేసారా?

హీరోయిన్ల కొరత బాగా వుండడంతో ఇప్పుడు వెటరన్‌ హీరోలకి అసలు హీరోయిన్లు దొరకడం లేదు. దాంతో శ్రియ, నయనతార లాంటి వాళ్లకే ఎక్కువ పారితోషికం ఇచ్చి తీసుకుంటున్నారు. కాజల్‌ అగర్వాల్‌ ఇప్పుడు సీనియర్‌ హీరోలతో పని చేయడానికి ఒక రేట్‌, కరెంట్‌ జనరేషన్‌ టాప్‌ హీరోల కోసం ఒక రేట్‌, యువ హీరోల కోసం మరో రేట్‌ అంటూ వివిధ టారిఫ్‌లతో నిర్మాతలని ఆకర్షిస్తోంది. ఆమెనుంచి స్ఫూర్తి పొందిందో లేక అవకాశాలు తగ్గాయి కనుక ఇక వీళ్లతోనే నటించాలనే ఆంక్షలు సడలించిందో కానీ తమన్నా కూడా త్వరలో వెటరన్స్‌ పక్కన కనిపించబోతోంది.

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌తో అనిల్‌ రావిపూడి తీసే ఎఫ్‌2లో వెంకీ సరసన తమన్నా నటిస్తుందని వినిపిస్తోంది. చరణ్‌తో పలు చిత్రాల్లో నటించిన తమన్నాకి వరుణ్‌ సరసన ఆఫర్‌ రాలేదట. వెంకీ పక్కన కూడా గ్లామర్‌ వున్న తార అయితే బాగుంటుందని అనిల్‌ రావిపూడి చెప్పడంతో తమన్నాని సంప్రదించారట. ఆమె రెగ్యులర్‌గా తీసుకునే పారితోషికానికి మించి ఇవ్వడానికి సిద్ధంగా వుండడంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు టాక్‌ వినిపిస్తోంది. కాజల్‌ మాదిరిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసే అవకాశాన్ని ఈ చిత్రం ఓపెన్‌ చేస్తుందా లేక పర్మినెంట్‌గా ఇలాంటి పాత్రలకి పరిమితం చేస్తుందా అనేది చూడాలి.


Recent Random Post: