
పిల్లలు ఎదగకూడదనుకునే తల్లిదండ్రులు బహుశా ప్రపంచంలో ఎక్కడా కన్పించరు. అరుదుగా వున్నా, వాల్ళనసలు తల్లిదండ్రులుగా పరిగణించం. మరి, తల్లిదండ్రులపై పగ తీర్చుకోవాలనుకునే వారిని సమాజం అంగీకరిస్తుందా.? ఛాన్సే లేదు. సరాదాగా అయినా, తల్లిదండ్రుల విషయంలో ‘రివెంజ్’ అన్న మాటని ఉపయోగించలేం. ఎందుకంటే, తల్లిదండ్రులకు మనం ఇచ్చే ‘గౌరవం’ అలాంటిది. కానీ, అక్కడున్నది రామ్‌గోపాల్ వర్మ. అందుకే, ఆయన ఏం మాట్లాడినా చెల్లిపోతోంది.
రామ్‌గోపాల్ వర్మ తల్లిదండ్రుల మీద ‘రివెంజ్’ తీర్చుకోవాలని చిన్నప్పుడే అనుకున్నాడట. అందుక్కారణం, ఎందుకూ పనికిరావని వర్మని ఉద్దేశించి తల్లిదండ్రులు అనడమే. అలా తల్లిదండ్రులు అన్నారంటే, అది పిల్లలకి చిన్నపాటి హెచ్చరికే తప్ప, ఆ మాటల్లో తల్లిదండ్రులకు ‘కసి’ వుండదు. శాపనార్థాలనేవి అసలే పెట్టరు. తిట్టినా, కొట్టినా అది ప్రేమ, ఆశీర్వాదంతోనే అన్నది వర్మకి అర్థమవుతుందా.?
‘శివ’ సినిమాకి తన తండ్రితో క్లాప్ కొట్టించి కసి తీర్చుకున్నాడట వర్మ. ఇప్పుడేమో నాగార్జునతోనే తీయబోయే కొత్త సినిమాకి తన తల్లితో క్లాప్ కొట్టిస్తాడట. అలా తన రివెంజ్‌ని పూర్తి చేయాలనుకుంటున్నట్లు వర్మ సోషల్ మీడియాలో వెల్లడించాడు. మామూలుగా ఈ విషయాన్ని చెబితే, జనం పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. అది వర్మకి నచ్చదుగాక నచ్చదు. కెలకడం, పదిమందీ తనను తిట్టేలా చేసుకోవడం.. ఆయనకి అదో సరదా.!
వర్మ కుమార్తెకి, పవన్ విషయమై వర్మ చేసిన పోస్టింగ్ అర్థం కాక, తన తండ్రి – పవన్‌ని తిడుతున్నాడో, పొగుడుతున్నాడో అర్థం కాక తండ్రి వర్మ మీద గుస్సా అయ్యింది వర్మగారి కుమార్తె. ఈ ఘనకార్యాన్ని వర్మ సోషల్ మీడియాలోనే వెల్లడించారండోయ్. పాపం, వర్మ తల్లిగారికి సోషల్ మీడియాలో అకౌంట్ లేదు కాబట్టి సరిపోయింది. వుండి వుంటే, వర్మ ‘రివెంజ్’పై ఆమె కూడా ఓ తల్లిగా ఇవ్వాల్సిన స్థాయిలో కౌంటర్ ఇచ్చి వుండేవారేనేమో.!
Recent Random Post:

















