
రీసెంట్ గా తన ప్రేమ, పెళ్లి విషయాల్ని నమిత బయటపెట్టిన సంగతి తెలిసిందే. స్నేహితుడు వీరేంద్ర చౌదరిని పెళ్లాడబోతున్నానని నమిత ప్రకటించింది. ఈనెల 24న పెళ్లి ఉంటుందని కూడా తెలిపింది. నమిత పెళ్లి తిరుపతిలో జరగబోతోంది. పెళ్లికి సంబంధించి ఇప్పటికే పిలుపులు కూడా మొదలయ్యాయి.
తిరుపతిలోని సింధూరి పార్క్ హోటల్ లో ఈనెల 22న జరగనున్న సంగీత్ తో నమిత పెళ్లి వేడుక మొదలవుతుంది. సింధూరి పార్క్ హోటల్ లో సాయంత్రం గం.7.30 నుంచి అర్థరాత్రి వరకు సంగీత్ ఉంటుంది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించారు.
ఇక 24వ తేదీన తిరుపతిలోని అలిపిరి బస్టాండ్ దగ్గరున్న ఇస్కాన్ లో నమిత పెళ్లి జరగనుంది. ఇస్కాన్ లో ఉదయం 5గంటల 30నిమిషాలకు పెళ్లిచేసుకోబోతోంది ఈ జంట. ఈ పెళ్లికి హీరో బాలకృష్ణతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో కొనసాగుతానని అంటోంది నమిత. తెలుగులో ‘సొంతం’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ, వెంకటేష్‌తో ‘జెమిని’, బాలకృష్ణతో ‘సింహా’ తదితర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఎక్కువగా తమిళ సినిమాలే చేస్తోంది.
Recent Random Post: