నారప్పలో మెప్పించిన అమ్మూ ఎవరు?

ప్రస్తుతం థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో కొన్ని చిత్రాలు ఓటిటి విడుదల కోసం చూస్తున్నాయి. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం కూడా నిన్న రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.

తమిళ సూపర్ హిట్ చిత్రం అసురన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కన్నమ్మగా కనిపించింది అమ్మూ అభిరామి, తమిళ్ లో తను పోషించిన పాత్రనే తెలుగులో కూడా చేసింది. కన్నమ్మగా క్యూట్ లుక్స్ తో అందరినీ మెప్పించిన అమ్మూ చాలా చిన్న వయసు నుండే నటించడం మొదలుపెట్టింది.

చెన్నైలో పుట్టి పెరిగిన ఈ భామ విజయ్ సినిమా భైరవలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. అలాగే తమిళ థ్రిల్లర్ రాచ్చసన్, దాని రీమేక్ రాక్షసుడు సినిమాల్లో హీరో మేనకోడలు పాత్రలు పోషించింది. ఇక ఇటీవలే విడుదలైన ఎఫ్సియూకేలో ఉమాగా కనిపించింది.