
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దానికి తోడు ఎమ్మెల్సీ.. వీటన్నిటికీ మించి మంత్రి.. ఇంతేనా, ఇంతకు మించి ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు. ఆయనే నారా లోకేష్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోవడానికి మొదటి కారణం నారా లోకేష్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీని పూర్తిగా నాశనం చేసేశాక, తెలంగాణ టీడీపీని వదిలేసి, ఏపీ రాజకీయాల్లో తలదూర్చి అక్కడ ఎమ్మెల్సీ పదవి దక్కించుకుని, మంత్రి అయిపోయిన ఘనుడు ఈ ‘చినబాబు’.!
గ్రేటర్ ఎన్నికల తర్వాతే పూర్తిగా తెలంగాణ టీడీపీని వదిలేసిన నారా లోకేష్, తెలంగాణ టీడీపీలో తాజా సంక్షోభంపై నిన్న స్పందిస్తూ, ‘వింత’ వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ వీడతానని రేవంత్‌రెడ్డి చెప్పారా.? మీరే బ్రేకింగ్ న్యూస్‌లు పెట్టారు.. మీరే, వాటి మీద స్పందించమని అడుగుతున్నారు..’ అంటూ మీడియా మీద గుస్సా అయిపోయారు నారా లోకేష్. ‘రేవంత్, పార్టీని వీడరు..’ అని కూడా చెప్పేశారు చినబాబుగారు. కానీ, వాస్తవం ఇంకోలా వుంది.
రేవంత్‌రెడ్డి, ఏపీ మంత్రులపై గుస్సా అయ్యారు. ఆ లెక్కన రేవంత్‌రెడ్డి, నారా లోకేష్‌పైనా, చంద్రబాబుపైనా అసహనం వ్యక్తం చేసినట్లే. ‘పార్టీకి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి మాట్లాడలేదు కదా.?’ అంటూ అమాయకంగా ప్రశ్నించేసిన లోకేష్, రేవంత్ వ్యాఖ్యల్ని, రేవంత్ తీరుని పూర్తిగా అర్థం చేసుకోలేని అమాయకుడని ఎలా అనుకోగలం.?
ఏపీలో టీడీపీ అధికారంలో వుంది కాబట్టి సరిపోయిందిగానీ, లేదంటే నారా లోకేష్ దెబ్బకి టీడీపీ పరిస్థితి తెలంగాణలో వున్నట్టే, ఏపీలోనూ తయారయ్యేదన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కనీసం రేవంత్‌రెడ్డితో మాట్లాడేందుకు సైతం లోకేష్ ప్రయత్నించలేదంటే, ఇక ఆయనకు ఆ పదవి ఎందుకట.!
తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా ఎమ్మెల్సీ అయిపోవడం, మంత్రి పదవి దక్కించుకోవడం.. ఇదే తన రాజకీయ ఘనత అని లోకేష్ విశ్వసిస్తుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.? అందుకే మరి, సోషల్ మీడియాలో లోకేష్ మీద ఆ స్థాయిలో ‘పొలిటికల్ పంచ్’లు పడిపోతుంటాయ్.
Recent Random Post:
            
		
















