పవన్ తో సినిమా చేస్తానంటున్న మహేష్ అక్క

పవన్ కోసం చాలామంది కథలు రెడీ చేస్తుంటారు. అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ల కూడా ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఓ సెలబ్రిటీ కూడా చేరారు. ఆవిడే మహేష్ అక్క మంజుల ఘట్టమనేని. మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారిన మంజుల, పవన్ ఒప్పుకుండే అతనితో ఓ సినిమా చేస్తానంటున్నారు. కథ కూడా రెడీగా ఉందని ప్రకటించారు.

“సినిమా పేరు పవన్ కల్యాణ్. ఇదోదే సరదాగా చెప్పడం లేదు. నిజంగానే చెబుతున్నాను. కథ కూడా ఉంది. మనసు చెప్పేది వినే వ్యక్తుల్లో పవన్ ఒకరు. నా తండ్రి కృష్ణ, తమ్ముడు మహేష్ తర్వాత మనసును ఫాలో అయ్యే వ్యక్తుల్లో నాకు పవన్ కనిపిస్తారు. ఆయన్ని చూస్తే జెన్యూన్ గా కనిపిస్తారు. అందుకే పవన్ కోసం కథ రెడీ చేశాను.”

ఇలా పవన్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు మంజుల. పవన్ ఇప్పటివరకు చేయని క్యారెక్టర్, ఇప్పటివరకు వినని స్టోరీలైన్ ను సిద్ధం చేశానంటున్నారు.”పవన్ ఇక సినిమాలు చేయరని విన్నాను. కానీ నా కథ వింటే కచ్చితంగా చేస్తారు. ఇప్పటివరకు పవన్ చేయని స్టోరీ ఇది. ఈ ఒక్క సినిమా చేసి ఆయన ఇక పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోవచ్చు. నా దగ్గర కథ ఉందని కాస్త మీరైనా (మీడియా) చెప్పండి.”ప్రస్తుతం మనసుకు నచ్చింది సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు మంజుల. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈసినిమా ఈనెల 16న థియేటర్లలోకి వస్తుంది.


Recent Random Post: