పవన్ సినిమాలో వినాయక్ క్యామియో

దర్శకులు స్క్రీన్ మీద కనిపించడం మనకు కొత్తేమి కాదు. కొంత మంది దర్శకులు కీలక పాత్రలు పోషిస్తే కొంత మంది మాత్రం క్యామియో రోల్స్ తో సంతోషపడుతుంటారు. వివి వినాయక్ ఆ కోవకు చెందిన వాడే. గతంలో ఠాగూర్, ఖైదీ నెం 150 చిత్రాల్లో క్యామియో పాత్రల్లో కనిపించాడు వివి వినాయక్.

తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే చిత్రంలో వినాయక్ చిన్న పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఒరిజినల్ లో క్యామియో రోల్ లో దర్శకుడు సాచి కనిపించాడు. రానా పాత్రతో పోలీసులతో గొడవ పడొద్దని చెప్పే చిన్న పాత్ర. ఈ రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు. తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తయిందని వినికిడి.