
తొలి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ నుంచి ఇప్పటిదాకా, ఏ సినిమాకి పనిచేసినా ఆ సినిమా ప్రమోషన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటోంది అందాల భామ మెహ్రీన్. ఆ విషయంలో ఎవరైనాసరే మెహ్రీన్‌ని అభినందించి తీరాల్సిందే. అలా తన సినిమా ప్రమోషన్‌కి తాను అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా, తనను తాను ప్రమోట్ చేసుకునే వీలుంటుందన్న చిన్న స్వార్ధం సంగతెలా వున్నా, దర్శక నిర్మాతలకీ మెహ్రీన్‌తో ‘వర్క్ ఎక్స్పీరియన్స్’ చాలా బాగుంటుందన్నది నిర్వివాదాంశం.
తమ సినిమాలో హీరోయిన్ని తమ సినిమా ప్రమోషన్ కోసం పిలిచేందుకు దర్శక నిర్మాతలు పడ్తున్న పాట్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సో, ఈ విషయంలో మెహ్రీన్ వెరీ గుడ్డే.! కానీ, ఏం లాభం.? మెహరీన్ నటించిన ‘కేరాఫ్ సూర్య’ సినిమాలో ఆమె నటించిన చాలా సీన్స్‌ని లేపేశారు. దాంతో మెహ్రీన్ బాగా హర్ట్ అయ్యింది. హర్ట్ అవకుండా ఎలా వుంటుంది మరి.! ఓ రేంజ్లో తన సినిమా గురించీ, అందులో తన పాత్ర గురించీ మెహ్రీన్ గొప్పగా చెప్పేసుకుంది కదా.!
ఇక, ‘కేరాఫ్ సూర్య’ సినిమాలోని సీన్స్ లేపేయడంపై దర్శకుడు సుశీంద్రన్ స్పందిస్తూ, హీరోయిన్ మెహ్రీన్‌కి ‘సారీ’ కూడా చెప్పేశాడు. ఈ విషయంలో సుశీంద్రన్నీ కొంతమేర అభినందించొచ్చు. మామూలుగా అయితే కమెడియన్లు నటించే సన్నివేశాలు లేపేయడం జరుగుతుంటుంది. కానీ, ఇక్కడ హీరోయిన్ మీద సీన్స్ లేపేశారు. అక్కడితో సినిమా మీద పడ్డ నెగెటివ్ ఇమేజ్ తగ్గిందన్న భావనని సుశీంద్రన్ వ్యక్తం చేయడంతో, సినిమాకి హీరోయిన్ పెద్ద మైనస్ అన్న విషయం బాగా ఎలివేట్ అయిపోతోంది. సో, మెహ్రీన్‌కి సుశీంద్రన్ చెప్పిన సారీ కాస్తా ఇలా రివర్సయ్యిందన్నమాట.
Recent Random Post: