ప్ర‌ధాని మోదీతో మెగా ఫ్యామిలీ..ఇది అరుదైన‌ ప్రేమ్!

నిన్న‌టి రోజున ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం ఎంత గ్రాండ్ గా జ‌రిగిందో తెలిసిందే. ఎన్డీయే కూట‌మిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉంటంతో వేడుక మ‌రింత రంగుల మ‌యంగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ , సురేఖ స‌హా అంతా హాజ‌ర‌య్యారు. ఇదే వేదిక‌పై ప్రధాని మోదీ కూడా మెరిసారు. బేసిక్ గానే సెల‌బ్రిటీలంటే? మోదీ అండ్ కో ఎంతో ఆస‌క్తిగా వ్య‌వ‌హ‌రి స్తుంటుంది.

అలాంటి టీమ్ కి చిరంజీవి-ప‌వన్ క‌ళ్యాణ్-రామ్ చ‌ర‌ణ్ ఒకే వేదిక‌పై క‌నిపిస్తే? మోదీ హ‌డావుడి మామూలుగా ఉంటుందా? దుమ్ము దుమారం అయిపోదు. స‌రిగ్గా నిన్న‌టి రోజున అదే జ‌రిగింది. మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌ను ప‌క్క‌న నిల‌బెట్టుకుని చేయి చేయి క‌లిపి ఇండియా స‌త్తా చాటుదాం? అన్న రేంజ్ సంచ‌ల‌నం సృష్టించారు. అది చూసిన చిరంజీవి ఇంత‌టి ఘ‌న‌త‌కు కార‌ణ‌మైన ప‌వ‌న్ ని చూసి ఎంతో మురిసిపోయారు.

ప‌వన్ క‌ళ్యాణ్ ని ముద్దాడారు. తాజాగా మెగా ఫ్యామిలీ అంతా ప్ర‌ధానీ మోదీతో క‌లిసి దిగిన ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇందులో చిరంజీవి దంప‌తులు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ దంప‌తులు ఉన్నారు. అలాగే ప‌వన్ కుమార్తె, కుమారుడు ఆద్య‌, అకీరా కూడా ఉన్నారు. వాళ్లంద‌రితో పాటు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా ఉన్నారు. అంద‌రూ క‌లిసి మోడీని మ‌ధ్య‌లో నిల‌బెట్టి ఫోటో దిగారు.

ఇందులో తోటికొడ‌ళ్లు ఇద్ద‌రు ప‌క్క ప‌క్క‌నే నిల‌బ‌డ్డారు. సురేఖ‌, అన్నా లెజ్నీవా మోదీ ప‌క్క‌నే నుంచున్నారు. మ‌రోవైపు చిరంజీవి, ప‌వ‌న్ పిల్ల‌లు ఉన్నారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ప్ర‌ధాని తో మెగా ఫ్యామిలీ నుంచి అభిమానులంతా సంబ‌ర ప‌డుతున్నారు. నాగ‌బాబు, అన్నాలెజ్నివా, సురేఖ, అకీరానంద‌న్, ఆద్య‌లు ప్ర‌ధానిని క‌ల‌వ‌డం ఇదే తొలిసారి.