బాలయ్య సినిమాకు టైటిల్ ఫిక్స్

అంతా ఊహించినట్టుగానే బాలయ్య సినిమాకు జై సింహా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెడ్డిగారు, కర్ణ, జై సింహా లాంటి పేర్లు చర్చకొచ్చాయి. ఫైనల్ గా “జై సింహా” అనే పేరును ఫైనలైజ్ చేశారు. గతంలో పెద్ద ఎన్టీఆర్ నటించిన సినిమాకు తాజా టైటిల్ కు మధ్య చిన్న తేడా పెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా పేరు జయసింహ కాగా.. బాలయ్య 102వ సినిమా పేరు ‘జై సింహా’.

ఈరోజు నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ అరకులో ప్రారంభమైంది.. బాలయ్య, హరిప్రియ, నటాషా మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇప్పటికే క్లయిమాక్స్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. హైదరాబాద్ మూసాపేట కంటైనర్ యార్డ్ లో క్లైమాక్స్ షూట్ పూర్తయింది. వైజాగ్ షెడ్యూల్ తర్వాత టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.

సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా అనుకున్న షెడ్యూల్స్ కంటే ముందే సిద్ధమౌతోంది. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ.. చెప్పిన టైమ్ కంటే నెల రోజుల ముందే మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణికి సంగీతం అందించిన చిరంతన్ భట్.. జై సింహాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.


Recent Random Post: