మాంఛి ‘మూడ్‌’లో ఆదా శర్మ

‘క్షణం’, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’, ‘హార్ట్‌ ఎటాక్‌’ తదితర తెలుగు సినిమాల్లో నటించిన అందాల భామ ఆదా శర్మ గుర్తుంది కదా.! ఈ బ్యూటీనే మీరు పై ఫొటోలో చూస్తోన్నది. మాంఛి మూడ్‌లో వున్నానంటూ ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఆదా శర్మ. ఓ పోల్‌, ఆ పైన చివర్లో కూర్చున్న ఆదా శర్మ.. నిజానికి ఇది పాత ఫొటోనే. కానీ, తన మూడ్‌కి తగ్గ ఫొటో అంటూ, ఈ ఫొటోని ఆమె ఇంకోసారి షేర్‌ చేయడం వెనుక ఇంట్రెస్టింగ్ కథే వుంది.

అదేంటంటే, ఆదా శర్మ తమిళంలో ఓ సినిమాలో నటించబోతోంది. ఆ ఆనందాన్నే, ఇలా ఫొటో రూపంలో వ్యక్తం చేసింది. అద్గదీ అసలు విషయం. హీరోయిన్‌గా తమిళంలో ఛాన్స్‌ కొట్టేశానోచ్‌.. అన్న ఆనందంలో, ఇలా ఇదిగో ఈ పోల్‌ పైకెక్కి కూర్చున్నానన్నది ఆదా శర్మ ఉద్దేశ్యం. ఆమెకి తమిళంలో దక్కింది కూడా ఓ బంపర్‌ ప్రాజెక్ట్‌ అట. నిజమేనా.? అదేంటో, రేపు తెలియనుంది.

అన్నట్టు, ఆదా శర్మ తన తల్లి నుంచి ఇదిగో, ఈ తరహా ఫీట్లు నేర్చుకుంది. వయసు మీద పడ్డా ఆదా శర్మ తల్లి ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడదట. తన తల్లే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అని చెప్పే ఆదా శర్మ కూడా, ఈ సంప్రదాయ వ్యాయామ క్రీడలో ఆరితేరిందండోయ్‌. సరే, ఈ ‘సంప్రదాయ’ టాలెంట్‌ని పక్కన పెడితే, అటు బాలీవుడ్‌ సినిమాలు, ఇటు టాలీవుడ్‌ సినిమాలు.. ఇంకోపక్క తమిళ సినిమా.. వెరసి, ఆదా శర్మ లక్కు బాగానే వున్నట్టుంది కదూ.!


Recent Random Post: