‘మా’ కొమ్ములు వంచిన శ్రీరెడ్డి

సినిమా రంగం అంటే తమ స్వంత జాగీరు అన్నట్లుగా, శ్రీరెడ్డితో ఎవరూ నటించినా వారిని వెలేస్తామంటూ ఫత్వా జారీ చేసిన టాలీవుడ్ నటీనటుల సంఘం ‘మా’ ఇప్పుడు తలవంచింది. దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తో తన సాన్నిహిత్య సంబంధానికి చెందిన ఫోటోలు బయటకు వదలడంతో సమస్య తీవ్రంగా మారింది. దాంతో ఈ విషయం ఇంత సీరియస్ గా మారడానికి కారణం ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా తీసుకున్న ‘వెలి’ నిర్ణయమే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఓ వ్యక్తిని నటించకుండా వెలి వేసే అధికారం ‘మా’కు ఎక్కడ వుందని అందరూ నిలదీసారు.

ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ’రామ్మా.. శ్రీరెడ్డి.. నువ్వు ‘మా’లో ఒకదానివి. మేమంతా నీతో వుండి నీకు అవకాశాలు వచ్చేలా చూస్తాం. తేజగారు ఇవ్వాళ ఫోన్ చేసి చెప్పారు రెండు సినిమాలు ఇస్తున్నా అని. ఇకపై ఈ చానెళ్లు వదిలేసి, నటన మీద దృష్టి పెట్టు. మా తొమ్మిది వందల మంది సభ్యులు నీతో నటించడినికి సిద్ధంగా వున్నాం..’ అన్నారు.


Recent Random Post: