రాజ్ కుంద్రా అరెస్టు.. అజ్ఞాతంలోకి శిల్పాశెట్టి..!

బాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు బాలీవుడ్ ని కుదిపేసింది. పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మీడియాకు ఆమె ఆచూకీ లభ్యం కావడంలేదు. జుహూ ప్రాంతంలో ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె సూపర్ డ్యాన్సర్ షో 4వ సీజన్ కు జడ్జిల్లో ఒకరిగా ఉంటున్నారు.

ఈ షోలో పాల్గొనేందుకు కూడా ఆమె అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు. రాజ్ కుంద్రాపై పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో ఆమెను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలుగా ఉన్న రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి దంపతులు ఫిక్సింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో రాజ్ కుంద్రాను ఐపీఎల్ నుంచి బహిష్కరించారు కూడా.