రోజాను కమెడియన్ అంటున్న నాగబాబు..! నెట్టింట్లో ఆయనపై సెటైర్లు

జబర్దస్త్ కార్యక్రమం ఎంత హాట్టయిందో తెలిసిందే. జడ్జిలుగా నాగబాబు – రోజా ఆ కార్యక్రమాన్ని ఓ స్థాయిలో నిలబెట్టారు. రాజకీయంగా ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే.. ఈమధ్య నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. జబర్దస్త్ లో మీకిష్టమైన కమెడియన్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. దానికి ‘రోజా’ అని సమాధానం ఇచ్చాడు నాగబాబు. దీనిపై నెటిజన్స్ ట్రోలింగ్స్ మొదులుపెట్టారు.

జబర్దస్త్ లో ఉన్న రోజా కమెడియన్ అయితే.. మొన్నటివరకూ ఉన్న నువ్వు కూడా కమెడియనే కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. అయితే.. రోజాను కమెడియన్ అనటానికి వెనుక కారణమేంటనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. ఇటివలి మున్సిపల్ ఎన్నికల్లో విజయం అనంతరం రోజా చేసిన వ్యాఖ్యలే కారణం అని అంటున్నారు. వైసీపీకి ఎవరు ఎదురొచ్చినా.. మేం ఒకరికి ఎదురెళ్లినా వాళ్లకే రిస్క్ అనే డైలాగే కారణమంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే.. నాగబాబు వ్యాఖ్యలకు రోజా ఇంకా స్పందించలేదు.