సల్మాన్… ఈ రాత్రి గడిస్తే..!

ఈ రోజే బెయిల్ వచ్చేస్తుంది.. ఇక మళ్లీ హై కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఏమైనా జరగొచ్చు అని వీరాభిమానులు అనుకున్నారు. కఈష్ణ జింకలను వేటాడిన కేసులో సల్లూను జోధ్‌పూర్ కోర్టు దోషిగా నిర్ధారించడం, ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిన సంగతే.అయితే ఇప్పుడు శిక్ష విధించింది కింది స్థాయి కోర్టే. పై కోర్టుకు వెళ్లాకా ఏమైనా జరగొచ్చు. కానీ నిన్నైతే సల్లూను జైలుకు తీసుకెళ్లారు. అక్కడ రేప్ కేసులో అరెస్టు అయిన ఆసారాం బాపూతో కలిపి ఉంచారు సల్మాన్ ను. నిన్న రాత్రి భారంగా గడిచింది సల్మాన్ కు.

ఇక ఈరోజు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది కానీ తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఏం జరుగుతుంది అనేదాన్ని బట్టి సల్మాన్ బయటకు రావడం ఆధారపడి ఉంది. దీంతో జైల్లో సల్మాన్ మరో రాత్రి గడపాల్సి వస్తోంది.

రేపుగనుక పిటిషన్ విచారణకు రాకపోయినా, విచారణ మళ్లీ వాయిదా పడినా.. ఆదివారం కూడా సల్మాన్ బయటకు రాలేడు. తరువాయి భాగం సోమవారమే. ఇక సల్మాన్ ఒక రాత్రి జైల్లో గడపగానే పరామర్శలు మొదలయ్యాయి. సల్మాన్ సహచర నటి ప్రీతీ జింతా సల్లూను పరామర్శించింది. ఇక తొలి రోజే ప్రీతీ కదిలి వచ్చిందంటే.. ఇక బాలీవుడ్ మొత్తం కదిలి వచ్చే అవకాశం ఉంది.


Recent Random Post: