షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యాక్టర్స్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువత బిగ్ స్క్రీన్ పైకి వచ్చి సక్సెస్ అవుతున్న నటులు ఉన్నారు. వారిలో రాజ్ తరుణ్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కిరణ్ అబ్బవరం సక్సెస్ ఫుల్ గా కెరియర్ లీడ్ చేస్తున్న హీరోగా ఉన్నాడు. తరువాత స్థానంలో టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ కనిపిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత సిల్వర్ స్క్రీన్ పై కమెడియన్ గా సినిమాలు చేసి సుహాస్ సక్సెస్ అయ్యాడు.
ఇక కలర్ ఫోటో సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకొని సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. దీని తర్వాత ఫ్యామిలీ డ్రామా అనే సినిమాలో సైకో పాత్రలో నటించి మెప్పించాడు. రీసెంట్ గా రైటర్ పద్మభూషణం మూవీతో డీసెంట్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. నాని తర్వాత నేచురల్ యాక్టింగ్ తో మెప్పిస్తున్న సుహాస్ ని హీరోగా అవకాశాలు భాగానే వస్తున్నాయి.
తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ స్వేచ్చ క్రియేషన్స్ సంయుక్తంగా ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ అనే టైటిల్ తో సుహాస్ హీరోగా మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి దర్శకుడు వెంకటేష్ మహా కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం.
సుహాస్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. దుష్యంత్ కటిననేని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మధ్యకాలంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి చిన్న హీరోలతో ఇంటరెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి.
తాజాగా కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో బన్నీ వాస్ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు వారి నుంచి సుహాస్ లీడ్ గా వస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ కూడా మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో బ్యాండ్ పార్టీ ట్రూప్ గా గోపరాజు రమణ పుష్ప ఫేమ్ జగదీష్ తో పాటు మరో ఇద్దరు కమెడియన్స్ కనిపిస్తున్నారు.
వారి మధ్యలో సుహాస్ డప్పుని భుజాన తగిలించుకొని కనిపిస్తున్నాడు. ఈ బ్యాండ్ పార్టీలో పని చేసే కుర్రాడిగా సుహాస్ ఈ మూవీలో కనిపిస్తున్నాడు. మ్యారేజ్ బ్యాండ్ బ్యాక్ డ్రాప్ లో మల్లిఖార్జున సెలూన్ కనిపిస్తుంది. దీనిని బట్టి అవుట్ అవుట్ ఫన్ రైడ్ తో సాగే కథగా ఉండబోతుందని చెప్పొచ్చు. మరి టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది వేచి చూడాలి.
Recent Random Post: