స్టార్‌ హీరో ఫ్యాన్స్ కి మాఫియా డబుల్‌ ధమాకా…!

తమిళంతో పాటు తెలుగు లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య ఇప్పటికే కంగువ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

కంగువ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే మరో సినిమాతో సూర్య రెడీ అవుతున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య ఒక సినిమాను చేస్తున్నాడు. అందుకు సంబంధించిన చిత్రీకరణ చకచక జరుగుతుంది. జూన్ 2న ప్రారంభం అయిన ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కార్తీక్ సుబ్బరాజు గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతుంది. హీరో పాత్ర తో పాటు నేపథ్యం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంతో పాటు, మంచి మెసేజ్ కూడా ఉంటుందని అంటున్నారు. తాజా తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సూర్య ను దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్ రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

మాఫియా బ్యాక్ డ్రాప్‌ ను చూపిస్తూనే ఒక పక్కా కమర్షియల్‌ మూవీగా ఈ సినిమాను దర్శకుడు రూపొందిస్తున్నాడట. ఈ మధ్య కాలంలో సూర్య కాస్త లుక్ ను చేంజ్ చేయడం జరిగింది. అది కార్తీక్ సుబ్బరాజు సినిమా కోసం అనే చర్చ జోరుగా సాగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ కు సూర్య, కార్తీక్ సుబ్బరాజ్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.