అంతా కలిసి ‘సూర్య’ను గాలికొదిలేశారు

ఓ పెద్ద సినిమా.. రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇలాంటప్పడు యూనిట్ లో హంగామా ఎలా ఉండాలి? ప్రచారంతో ఊదరగొట్టాలి. లేటెస్ట్ స్టిల్స్, ట్రయిలర్స్ తో హంగామా చేయాలి. వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. కానీ నా పేరు సూర్య విషయంలో ఇలాంటి హంగామా ఏదీ కనిపించడం లేదు. 2రోజుల నుంచి ఈ సినిమా ప్రచారాన్ని పక్కనపెట్టారు. ఇంకా చెప్పాలంటే సూర్యను అంతా కలిసి గాలికొదిలేశారు.

ఇప్పటివరకు కేవలం ఓ కామన్ ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చాడు బన్నీ. సినిమాకు సంబంధించి క్యాప్ ట్రిక్స్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతే.. అక్కడితో ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. నిన్నటికినిన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేస్తారనుకుంటే ఓ యాప్ ను ప్రమోట్ చేశారు. ఇక ఈరోజైతే అంతా తమ ఇళ్లకే పరిమితం అయిపోయారు.

ఓ సినిమా షూటింగ్ కోసం హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ చెన్నై వెళ్లిపోయింది. హీరో బన్నీ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. నాగబాబు, లగడపాటి రిలాక్స్ అయిపోయారు. వక్కంతంను అడిగితే రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తానంటున్నాడు. ఇక సంగీత దర్శకులైతే అసలు హైదరాబాద్ కే రావట్లేదు. ఇలా మెయిన్ క్రూ అంతా కామ్ అయిపోయింది.

ఈ సినిమా 111కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు ప్రకటించారు నిర్మాతలు. ఇంత మొత్తం వెనక్కు రావాలంటే భారీస్థాయిలో ప్రచారం చేయాలి. కానీ అలాంటిదేం కనిపించడం లేదు. ఓవర్సీస్ లో మరికొన్ని గంటల్లో నా పేరు సూర్య ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.


Recent Random Post: