
తెలుగు సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్‌కి చాలా చులకన. ఆ మాటకొస్తే, సౌత్ సినిమా అంటేనే బాలీవుడ్‌కి ఓ రేంజ్లో చులకన భావం. అయితే, అదంతా పాత మాట. ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ విషయంలో ‘జక్కన్న’ రాజమౌళికి హేట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్‌లోనూ సత్తా చాటినా, విశ్వనటుడు కమల్‌హాసన్ బాలీవుడ్ తెరపైనా అద్భుతాలు చేసినా, అవేవీ బాలీవుడ్ సినీ జనాలకి పెద్దగా కన్పించలేదు.
సౌత్ సినిమాల్లో నటించాలంటే, అదో నామోషీగా ఫీలయ్యే బాలీవుడ్ సినీ జనం చాలామందే కన్పిస్తారు. అందరూ అని కాదుగానీ, ఎక్కువమందిది అదే ఆలోచన. కానీ, ‘బాహుబలి’తో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ‘బాహుబలి’ సినిమాని తెలుగు సినిమాగా కాదు, ఇండియన్ సినిమాగా బాలీవుడ్ చూసిందంటే, ఆ సినిమా సాధించిన విజయం అలాంటిది. ‘నాన్ బాహుబలి రికార్డ్’ అని బాలీవుడ్లో ఈ మధ్య విడుదలవుతోన్న ప్రతి సినిమా గురించీ చెప్పుకోవాల్సి వస్తోంది.
ఇక, అసలు విషయానికొస్తే బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, సౌత్ సినిమా గురించి చాలా చాలా గొప్పగా చెప్పాడు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘2.0’ సినిమాలో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. సౌత్ సినిమాలో నటించడం తనకు గర్వకారణంగా వుందనీ, ఇక్కడంతా ప్రొఫెషనల్స్‌గా వ్యవహరిస్తారనీ, బాలీవుడ్‌తో పోల్చితే పని పట్ల అంకిత భావం చాలా ఎక్కువనీ, ఆ కమిట్మెంట్కి తాను ఫిదా అయిపోయాననీ అక్షయ్‌కుమార్ అన్నాడు.
అంతేనా, ఎంత ఎదిగినా ఒదిగి వుండడం కొంతమందికే చెల్లుతుంది. ఆ విషయంలో రజనీకాంత్, సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఆదర్శం.. అని చెప్పాడు అక్షయ్‌కుమార్. ఆహాహా.. సౌత్ సినిమాని ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఈ స్థాయిలో అభినందిస్తోంటే, భలే వినసొంపుగా వుంది కదూ.!
Recent Random Post:

















