అజ్ఞాతవాసి: ఇప్పుడు కీర్తిసురేష్ వంతు

ప్రస్తుతం బల్గేరియాలో అను ఎమ్మాన్యుయేల్ తో రొమాన్స్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. పవన్, అను మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా పిక్చరైజ్ చేశారు. ఇప్పుడు కీర్తి సురేష్ వంతు వచ్చింది. ఈమె కూడా యూరోప్ బయల్దేరింది.

మహానటి సినిమాకు సంబంధించి ఢిల్లీలో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన కీర్తి సురేష్.. అట్నుంచి అటే యూరోప్ బయల్దేరింది. మధ్యలో మాస్కోలో దిగి షాపింగ్ కూడా చేసింది. ఆ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రేపట్నుంచి సోఫియా సిటీలో పవన్-కీర్తిసురేష్ కాంబినేషన్ లో సన్నివేశాలు తీయబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ పాట కూడా షూట్ చేయబోతున్నారు.

మరికొన్ని గంటల్లో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. “బయటకొచ్చి చూస్తే” అనే లిరిక్స్ తో సాగే పాటకు సంబంధించి ఇప్పటికే ట్యూన్ బయటకొచ్చింది. ఇప్పుడు ఆ మొత్తం సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయబోతున్నారు.


Recent Random Post: