‘అదిరింది’.. మళ్లీ ఆగింది

లెక్కప్రకారం ఈరోజు రామ్ సినిమాతో పాటు థియేటర్లలోకి రావాలి అదిరింది మూవీ. కానీ ఈ సినిమా మరోసారి వాయిదాపడింది. తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తికాకపోడంతో తమిళ వెర్షన్ (మెర్సెల్)తో సైమల్టేనియస్ గా రిలీజ్ కాలేకపోయింది ‘అదిరింది’. కానీ ఇప్పుడు సెన్సార్ పూర్తయినప్పటికీ మూవీ వాయిదా పడింది.

అదిరింది మూవీకి సెన్సార్ కంప్లీట్ అయింది. కాకపోతే అది చెన్నైలో కంప్లీట్ అయింది. తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్న శరత్ మరార్ కు చెన్నై నుంచి సకాలంలో సెన్సార్ సర్టిఫికేట్ అందలేదు. పైగా విడుదలపై ఒరిజినల్ నిర్మాణ సంస్థ తేనాండాళ్ స్టుడియోస్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మూవీ రిలీజ్ మరోసారి వాయిదాపడింది.

తమిళ్ లో మెర్సెల్ సినిమాకు భయంకరమైన వసూళ్లు వస్తున్నాయి. విజయ్ క్రేజ్ కు తోడు వివాదాలు కూడా యాడ్ అవ్వడంతో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. అలా రిలీజైన మొదటి వారానికి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 170కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ఇదే ఊపులో తెలుగులో కూడా సినిమాను విడుదల చేసి క్రేజ్ ను క్యాష్ చేసుకుందామనేది శరత్ మరార్ ప్లాన్. కానీ మూవీ మాత్రం ముచ్చటగా మూడోసారి వాయిదాపడింది. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించబోతున్నారు.


Recent Random Post: