అదొక్కటే ఎలివేట్‌ అవుతోంది: రకుల్‌

సౌత్‌ సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్‌కి తప్ప దేనికీ పనికిరారన్న విమర్శ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విన్పిస్తోంది. సౌత్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని, బాలీవుడ్‌లోకి వెళ్ళిన హీరోయిన్లు, అసలు సౌత్‌ సినిమాలతో సంబంధం లేనివారూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న విషయం విదితమే.

ఈ విషయమై హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సౌత్‌ సినిమాపై ‘గ్లామర్‌’ పేరుతో జరుగుతున్న దుష్పచారాన్ని ఖండించింది. ‘ఓ సినిమాలో గ్లామరస్‌గా కన్పించాల్సి వస్తుంది.. ఇంకో సినిమాలో గ్లామర్‌తో సంబంధం లేకుండా పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాం.

కానీ, గ్లామరస్‌ పాత్రలే ఎలివేట్‌ అవుతాయి.. సమస్య అక్కడే వస్తోంది.. కొందరు పనిగట్టుకుని చేసే విమర్శల్ని పట్టించుకోవాలి్సన అవసరం లేదు..’ అంటూ క్లారిటీ ఇచ్చింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

‘అనుష్కనే తీసుకుంటే, ఆమె ‘బాహుబలి’ సినిమా ఫస్ట్‌ పార్ట్‌లో డీ గ్లామర్‌గా నటించింది. ఆ సినిమాలో అసలు ఎక్స్‌పోజింగ్‌ అన్న మాటే వుండదు. అదే సమయంలో ఆమె కొన్ని గ్లామరస్‌ సినిమాలూ చేసింది. గ్లామరస్ సినిమాల కంటే, గ్లామర్ లేకుండా చేసిన అరుంధతి, బాహుబలి సినిమాలే ఆమెకు ఎక్కువ గుర్తింపునిచ్చాయి.

సౌత్‌ సినిమా గురించి ముంబైలో చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. సినిమాకి సంబంధించి టెక్నాలజీని అందిపుచ్చుకునే విధానం.. వెర్సటాలిటీ.. ఇవన్నీ సౌత్‌ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపునిస్తున్నాయి. ఈ సినీ పరిశ్రమలో నేనూ భాగమైనందుకు గర్వంగా వుంది..’ అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చింది.


Recent Random Post: