అబ్బే నేనలాంటిదాన్ని కాను.!

సినిమా షూటింగ్‌ సమయంలో అభ్యంతరాలేమీ లేవు. గ్లామర్‌కి ఓకే.. ఎక్స్‌పోజింగ్‌కి డబుల్‌ ఓకే.. వల్గారిటీ అయినా ఇబ్బందుల్లేవ్‌.! కానీ, తీరా సినిమా పూర్తయి, విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఎక్కడో చిన్న టెన్షన్‌.! ఆ టెన్షన్‌ పెరిగి పెద్దదవడంతో, ‘ప్లీజ్‌, వద్దు.. ఆ సన్నివేశాలు చూపించొద్దూ..’ అంటూ ఓ హీరోయిన్‌, దర్శక నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తే.?

తమిళ సినిమా ‘ఏమాళి’ విషయంలో హీరోయిన్‌ అతుల్య అభ్యర్థన ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. సినిమా టీజర్‌ బయటకొచ్చాకగానీ, అందులో తానెంత ఓవర్‌ డోస్‌ హాట్‌ అప్పీల్‌ని పండించేసిందీ అమ్మడికి తెలిసిరాలేదు. సిగరెట్‌ స్మోకింగ్‌, హీరోతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌.. ఇలా అన్నిట్లోనూ అదరగొట్టేసింది. అక్కడే వ్యవహారం తేడా కొట్టేసింది. సోషల్‌ మీడియాలో ‘ట్రాలింగ్‌’ తట్టుకోలేకపోతోంది అతుల్య. అంతే కాదు, కుటుంబ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట.

‘సినిమా ఓ మంచి ఉద్దేశ్యంతో చేశాం. నా పాత్ర ద్వారా ఓ మంచి మెసేజ్‌ బయటకు వస్తుంది. అయితే, టీజర్‌ పట్ల కొందరు వ్యక్తం చేస్తున్న అభ్యంతరం, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో నేనిలా మాట్లాడాల్సి వస్తోంది..’ అంటూ అతుల్య వివరణ ఇచ్చుకుంది.

నిజానికి, ఈ తరహా సినిమాలు కొత్తేమీ కాదు. ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలానే వచ్చాయి. కానీ, అతుల్య కొంచెం ఎక్కువగా రియాక్ట్‌ అవుతోందేమో అన్పించకమానదు. కొన్నాళ్ళ క్రితం తెలుగులో ‘ఎవడు’ పేరుతో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా వచ్చింది. అందులో ఓ పాటలో శృతిహాసన్‌ వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్‌ చేసేస్తుంది. సినిమా విడుదలైపోయింది. ఆ తర్వాత ఆ పాటకు సంబంధించిన ఫొటోలపై వివాదం తెరపైకొచ్చింది. అదే మరి, కామెడీ అంటే.!

ఒక్కటి మాత్రం నిజం. సినిమా తెరపై కన్పించే హీరోలు, హీరోయిన్లు, విలన్లు.. నిజ జీవితంలోనూ అలాగే వుంటారని ఎవరూ అనుకోరు. కానీ, గ్లామర్‌ విషయంలో ‘విజ్ఞత’ అనేదొకటుంటుంది. సక్సెస్‌ కోసం, అవకాశాల కోసం హద్దులు దాటేసి, తూచ్‌ అనేస్తే అదొక పబ్లిసిటీ స్టంట్‌ అవుతుంది తప్ప, నిజంగానే వారిలో ‘రియలైజేషన్‌’ వచ్చిందని ఎలా అనుకోగలం.?


Recent Random Post: