ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ సాధించలేనిది అల్లు అర్జున్ సాధించారు. తాజాగా ఆయన పుష్ప మూవీలో నటనకు గాను, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడికి సంబంధించిన జాతీయ అవార్డుల్లో ఇప్పటి వరకు ఏ తెలుగు నటుడు అవార్డు పొందలేదు. తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ కావడం విశేషం.
దీంతో, సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ అవార్డు వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ సైతం ఎమోషనల్ అయ్యాడు. తన భార్య స్నేహారెడ్డిని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. టాలీవుడ్ లోని ప్రముఖులంతా ఇప్పుడు అల్లు అర్జున్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, ఈ జాబితాలో తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా చేరారు.
ఇక, పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటన గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీ విడుదలైన సమయంలో సునామీ సృష్టించింది. తెలుగు వారు మాత్రమే కాదు, దక్షిణాదిన వారు కూడా అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిపోయారు. టీమ్ ఇండియా క్రికెటర్లు సైతం పుష్ప స్వాగ్ ని ఫాలో అయ్యారు అంటే, ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
ఇక, ఈ పుష్ప మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిచింది. త్వరలోనే ఈ మూవీ రెండో భాగం కూడా థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది. మరి రెండో భాగం ఇంకెన్ని అవార్డులు తెస్తుందో చూడాలి.
Recent Random Post: