
ఫలానా హీరోతో ఎఫైర్ వుందట.. ఫలానా సినిమాకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారట.. ఇవన్నీ తన దృష్టిలో పరమ బోరింగ్ గాసిప్స్ అంటోంది అందాల తార నయనతార. వయసు మీద పడ్తున్న కొద్దీ నయనతార స్టార్‌డమ్ పెరుగుతూ వస్తోంది. దాంతోపాటే, ఆమె రెమ్యునరేషన్ కూడా ఎవరూ ఊహించని రేంజ్‌కి చేరుకుంటోంది. దటీజ్ నయనతార.!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార, తెలుగులో కంటే తమిళంపైనే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టింది. తాజాగా తమిళంలో ‘అరామ్’ సినిమాతో విజయాన్ని అందుకున్న నయనతారపై మళ్ళీ ‘రెమ్యునరేషన్’ గాసిప్స్ చాలా గట్టిగా విన్పించేస్తున్నాయి. ‘ఆరామ్’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న నయనతార, రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు అస్సలు అందుబాటులో లేకుండా పోయిందన్నది ఆ గాసిప్స్ సారాంశం.
ఇదే విషయాన్ని నయనతార దగ్గర ప్రస్తావిస్తే, ‘సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఈ గాసిప్స్ కారణంగా.. నేనడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఏ నిర్మాతా ముందుకు రారు.. నా ఇమేజ్ ఏంటో, నా పాపులారిటీ ఏంటో తెలుసుకునే నిర్మాత నన్ను సంప్రదిస్తారు. ఆ డీల్ నచ్చితే సినిమా చేస్తాను.. చాలా సందర్భాల్లో డీల్ సంగతెలా వున్నా, సినిమా కథ నచ్చితే ఓకే చెప్పేస్తాను.. ఇదీ నాకు తెలిసిన లెక్క..’ అంటూ నయనతార చెప్పుకొచ్చింది.
పైకి నయన ఏం చెప్పినా, కోలీవుడ్‌లో ఇప్పుడు అత్యధిక పారితోషికం అందుకుంటోన్నది నయనతార మాత్రమే అన్నది నిర్వివాదాంశం. టాలీవుడ్‌లోనూ నయనతారకి రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
Recent Random Post: