ఆచార్య : హోళీ అయ్యింది ఇప్పుడు ఉగాది

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఫస్ట్‌ లుక్‌ను హోళీ సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా మెగా వర్గాల ద్వారా వార్తలు వినిపించాయి. కాని హోళీ పండుగ పోయింది. హోళీకి ఆచార్య ఫస్ట్‌లుక్‌ వస్తుందని ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. హోళీ పండుగకు అంటూ నిన్న మొన్నటి వరకు చెబుతూ వచ్చిన వారు ఇప్పుడు ఉగాదికి అంటూ ప్రచారం మొదలు పెట్టారు.

ఉగాది కానుకగా ఖచ్చితంగా చిరంజీవి ఆచార్య ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు అంటూ వారు చెబుతున్నారు. మార్చి 25వ తారీకున ఉగాది సందర్బంగా ఆచార్య ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ లేదంటే టీజర్‌ను అయినా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దర్శకుడు కొరటాల శివ సినిమాను చాలా స్పీడ్‌గా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ఫస్ట్‌లుక్‌ ఇతర విషయాలపై పట్టించుకునే ఆసక్తి చూపడం లేదని కొందరు అంటున్నారు.

త్రిష హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కాని ఇప్పటి వరకు హీరోయిన్‌ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆచార్య ఎలా ఉండబోతున్నాడు అనే విషయమై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. చిరంజీవి లుక్‌ లీక్‌ అవ్వడంతో ఫస్ట్‌లుక్‌పై ఆసక్తి లేదు. కాని టీజర్‌ వస్తే బాగుంటుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం మహేష్‌బాబును ఒప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై కూడా క్లారిటీ రాలేదు.