ఆయనను సీఎం చేయడమే రేవంత్ లక్ష్యమా?

ఎలాగూ తనకు ఛాన్స్ దక్కనివ్వరు.. ఈ మాత్రం క్లారిటీ అయితే ఉంది రేవంత్ రెడ్డికి. నిజంగానే రేపటి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుని.. అధికారంలోకి వచ్చినా.. రేవంత్ కు అయితే సీఎం ఛాన్స్ ఏ మాత్రం దక్కదు. అసలు కాంగ్రెస్ కు అధికారం దక్కుతుందా? అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయవచ్చు. వ్యంగ్యంగా చూడవచ్చు. అయితే.. తెలంగాణ సమాజం కొంత రెబల్. ఎవరికైనా రెండో ఛాన్స్ అంత తేలికగా ఇవ్వదు.

అరుదుగా మాత్రమే రెండో సారి కూడా చాన్స్ ఇస్తూ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం నాటి ఫలితాలను సమీక్షించినా.. ఈ విషయం స్పష్టం అవుతుంది., ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో రేపటి ఎన్నికల్లో టీఆర్ఎస్ బోల్తా పడినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ వైపు లీడర్లున్నారా? పేరున్న వాళ్లున్నారా? అనే ప్రశ్నలకు కూడా ఎన్నికల ఫలితాలు అతీతమైనవి.

అనామకులను ఎమ్మెల్యేలను గెలిపించడం కూడా తెలంగాణ ప్రజల ప్రత్యేకత. కాబట్టి.. గట్టిగా పోరాడితే ప్రజల్లో ఎంతో కొంత నమ్మకాన్ని కలిగిస్తే, కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత మరింతగా ప్రబలితే.. కాంగ్రెస్ కు అధికారం ముచ్చట సాధ్యం అయ్యే పనే! మరి అలాంటి అవకాశం వస్తే.. సీఎం సీటుపై తన మామను కూర్చోబెట్టాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అంటూ అధికారం దగ్గరయితే.. సీఎం అభ్యర్థులు ఎంతమంది ఉంటారో వేరే చెప్పనక్కర్లేదు.

2004ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఉప్పునూత పురుషోత్తమ రెడ్డి కూడా సీఎం పీఠాన్ని ఆశించారు. అలాంటి ఆశవహులు ఎంతో మంది. రేపు తెలంగాణలో కాంగ్రెస్ కు ఛాన్సు వస్తే.. వీ హనుమంతరావు కూడా సీఎం అభ్యర్థే అని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ వంటి వాళ్లకు ఛాన్సే లేదు. అందుకే మామను ముందు పెట్టుకుని రాజకీయం నడపాలనేది రేవంత్ లక్ష్యంగా తెలుస్తోంది. సీఎం సీటుపై జైపాల్ ను కూర్చోబెట్టుకుంటే తనకు తిరుగుండదనేది రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది. జైపాల్ అభ్యర్థిత్వాన్ని హై కమాండ్ కూడా కాదనలేదు కదా


Recent Random Post: