ఆయన తిడతాడు.. ఈయనేమో దీవెనలంటాడు

సరిగ్గా నెల రోజుల కిందట మ్యూజిక్ డైరక్టర్ తమన్ పై మోహన్ బాబు చేసిన కామెంట్స్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. వేగంగా సాంగ్స్ ఇచ్చే తమన్ ను పట్టుకొని బద్ధకస్తుడు అనే బిరుదు తగిలించారు మోహన్ బాబు. తమన్ అంత బద్ధకస్తుడ్ని తను ఎక్కడా చూడలేదని, అతడితో పనిచేయడం తనలాంటి వాడికి చాలా కష్టమని ఓపెన్ గానే అనేశారు.

ఇది జరిగిన ఇన్ని రోజులకు తమన్ రియాక్ట్ అయ్యాడు. ఛల్ మోహన్ రంగ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన తమన్, అప్పటి మోహన్ బాబు కామెంట్స్ పై స్పందించాడు. మోహన్ బాబు లాంటి పెద్ద వ్యక్తి తిడితే వాటిని దీవెనలుగా తీసుకోవాలని అంటున్నాడు.అదే సమయంలో తన వర్క్ ను సమర్థించుకున్నాడు తమన్. కేవలం మంచి ట్యూన్స్ అందించాలనే ఉద్దేశంతోనే గాయత్రి సినిమాకు కాస్త టైమ్ తీసుకున్నానని, అంతకుమించి తనకు ఎలాంటి తప్పుడు ఆలోచన లేదని అంటున్నాడు.

తమన్ స్టేట్ మెంట్ తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే భవిష్యత్తులో మళ్లీ మోహన్ బాబు సినిమాకు ఇక తమన్ పనిచేయడేమో.


Recent Random Post: