
దండుపాళ్యం మంచి హిట్ అయింది. దండుపాళ్యం-2 కూడా వచ్చింది. అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు దండుపాళ్యం-3 కూడా విడుదలకు సిద్ధమైంది. స్టార్టింగ్ నుంచి ఒకే బ్యాచ్ ఈ సిరీస్ లో నటిస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… దండుపాళ్యం-4 వస్తోంది. ఈ పార్ట్-4కు ఒరిజినల్ దండుపాళ్యానికి సంబంధం లేదు. అదే ఇక్కడ లొల్లి.
దండుపాళ్యం-4 ఫస్ట్ లుక్ టైటిల్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. హీరో శ్రీకాంత్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి అతడి చేతుల మీదుగా టైటిల్, పోస్టర్లు విడుదల చేశారు. దండుపాళ్యం గత సినిమాల్లో ఉన్న బ్యాచ్ మొత్తం ఈ పోస్టర్లలో ప్రత్యక్షమైంది. కానీ ఈ పార్ట్-4కు తమకు సంబంధం లేదని వాదిస్తున్నారు నటీనటులు.
మొదట్నుంచి దండుపాళ్యంలో నటిస్తున్న పూజాగాంధీ, మకరంద్ దేశ్ పాండే, రవికాలే ఈ మేటర్ పై స్పందించారు. దండుపాళ్యం-4లో తాము లేమని స్పష్టంచేశారు. పోస్టర్లలో తమ ఫోటోలు వాడడం ఏమాత్రం బాగాలేదని, వెంటనే దీనిపై మేకర్స్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిజానికి దండుపాళ్యం ఒరిజినల్ యూనిట్ కు, దండుపాళ్యం-4 మూవీని ప్రకటించిన నిర్మాత వెంకట్ కు మధ్య ఏవో సమస్యలున్నాయి. ఈ ఒరిజనల్ బ్యాచ్ ను ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో వెంకట్ ఇలా దండుపాళ్యం-4ను ఎనౌన్స్ చేసినట్టున్నాడు. ఈ నేపథ్యంలో అసలైన దండుపాళ్యం టైటిల్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
Recent Random Post:

















