ఇది హిట్ అయితే ఆ హీరోలిద్దరికీ బాధ

రాజా ది గ్రేట్ థియేటర్లలోకి వచ్చేసింది. మరికాసేపట్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడు రవితేజ. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇదే సినిమా హిట్ అయితే మాత్రం రామ్, ఎన్టీఆర్ కచ్చితంగా బాధపడతారు.

అవును.. రాజా ది గ్రేట్ హిట్ అయితే రామ్, ఎన్టీఆర్ బాధపడడం ఖాయం. ఎందుకంటే ఈ స్టోరీని వీళ్లిద్దరూ తిరస్కరించిన తర్వాతే రవితేజ దగ్గరకు వెళ్లింది. సో.. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఓ హిట్ సినిమా వదులుకున్నామని బాధ వీళ్లకు కలగక మానదు. రామ్, ఎన్టీఆర్ కు చెప్పిన కథను పూర్తిగా మార్చేసి రవితేజకు వినిపించానని చెబుతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కానీ స్టోరీలైన్ మాత్రం అదే.

అయితే ఎన్టీఆర్ కంటే ఎక్కువగా హర్ట్ అయ్యేది మాత్రం కచ్చితంగా రామ్. ఎందుకంటే ఎన్టీఆర్ కేవలం కథ మాత్రమే విన్నాడు. తన అంగీకారం తెలపలేదు. కానీ రామ్ మాత్రం సినిమా ఓకే చేసినట్టు స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు. అంధుడి క్యారెక్టర్ అని కూడా ఎనౌన్స్ చేశాడు.

కానీ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. రామ్ ఎందుకు తప్పుకున్నాడనే విషయంపై అప్పట్లో చాలా రీజన్స్ బయటకొచ్చినప్పటికీ వాటిని ఇక్కడ చర్చించుకోవడం అనవసరం. అలా చేజారిన ప్రాజెక్టును రవితేజ అందుకున్నాడు. రాజా ది గ్రేట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇది హిట్ అయితే ఎన్టీఆర్ కంటే ఎక్కువగా బాధపడతాడు రామ్.