ఈ మిస్ ఇండియా ముద్దుగుమ్మ గతంలో ఏ యాడ్ లో నటించిందో తెలుసా?


కర్ణాటకకు చెందిన సినీ శెట్టి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటాన్ని సాధించింది. రాజస్థాన్కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్గా ఉత్తరప్రదేశ్కు చెందిన షీనాతా చౌహాన్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. దేశంలోని అందగత్తెలను వెనక్కి నెట్టి మిస్ ఇండియా కిరీటాన్ని సినీ శెట్టి అందుకోవడం విశేషం.

21 ఏళ్ల ఈ కన్నడ సోయగం.. మిస్ ఇండియా 2022 విజేతగానూ నిలిచింది. ఆదివారం జరిగిన 58వ ఫెమినా అందాల పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన 31మంది ఫైనలిస్టులు పోటీపడ్డారు. ఇందులో కర్ణాటకకు చెందిన సినీ శెట్టి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతగా ప్రకటించారు.

సినీ శెట్టిది కన్నడ అయినా కూడా ముంబైలోనే మోడల్ గా స్థిరపడింది. 2001లో ముంబైలో జన్మించింది. ఫ్యాషన్ పై ఉన్న ఆసక్తితో ప్రపంచంలో మోడల్ గా తెరపైకి వచ్చింది. చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ లో ఆరితేరిపోయింది.

సోషల్ మీడియాలో సైతం పెద్దగా వినపడని.. కనపడని ఈ అందగత్తె కేవలం ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే అకౌంట్ కలిగి ఉండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఫేస్ బుక్ మొత్తం విస్తరించింది.. ట్విట్టర్ లోనూ ప్రముఖులున్నారు. కానీ ఈ రెండింటిలోనూ సినీ శెట్టి లేదు. కేవలం ఇన్ స్టాలో మాత్రమే ఉంది. ఆమె ప్రకృతి ప్రేమికురాలు కావడంతో తన తొలి పోస్ట్ సైతం ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టుగానే ఉంది.

సినీ శెట్టి అకౌంటింగ్ ఫైనాన్స్ లో గ్రాడ్యూయేషన్ చేశారు. సినీ శెట్టి ప్రస్తుతం సీఎఫ్ఏ చేస్తున్నారు. ప్రముఖ నెట్ వర్కింగ్ కంపెనీ ఎయిర్ టెల్ కోసం గతంలో రూపొందించిన యాడ్ లో సినీ శెట్టి కెమెరా ముందుకు వచ్చింది. కెమెరా ముందు తన ప్రయాణం ఎంతో సరదాగా సాగిందని ఆమె తెలిపారు.

ఇక సినీ శెట్టి భరతనాట్యం డ్యాన్సర్ కూడా. ఎంతో మంది కొరియాగ్రాఫర్స్ తోనూ పనిచేసింది. కష్టపడి దాన్ని సొంతం చేసుకోవాలని సినీ శెట్టి స్వయం కృషితో ఈ స్తాయికి చేరడానికి కృషి చేసింది.