
సినిమా ఎండింగ్ పై క్లారిటీ లేనప్పుడు రెండు రకాల క్లయిమాక్స్ లు షూట్ చేయడం సహజం. ఎడిటింగ్ టైమ్ లో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. కానీ ఫుల్ క్లారిటీ ఉన్నప్పటికీ 2రకాల క్లయిమాక్స్ లు తీస్తున్నారు. 2కాదు, ఏకంగా 3రకాల క్లైమాక్సులు తీస్తున్నారు.
అవును.. రేస్-3 సినిమా కోసం ఇలా వినూత్న ఆలోచన చేశారు మేకర్స్. సినిమా క్లయిమాక్స్ లీక్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా 3ముగింపులిచ్చారు. వీటిలో ఏది సినిమాలో ఉంటుందనేది సస్పెన్స్. ఆఖరి నిమిషంలో ముందే నిర్ణయించుకున్న క్లయిమాక్స్ పార్ట్ ను సినిమాకు జోడిస్తారట.
రేస్ సిరీస్ మొత్తానికి క్లయిమాక్సే ప్రాణం. ఊహించని ట్విస్ట్ తో ముగుస్తుంది సినిమా. రేస్-3 కూడా అందుకు మినహాయింపు కాదు. అలాంటి కీలకమైన క్లయిమాక్స్ సీన్ ఏంటనే విషయం రిలీజ్ కు ముందే జనాలకు తెలిసిపోతే సినిమాపై ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే లీకేజీల్ని నిరోధించేందుకు ఇలా 3రకాల ముగింపులు షూట్ చేసి సిద్ధంగా పెట్టుకున్నారు.
సల్మాన్ ఖాన్, బాబి డియోల్, అనీల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
Recent Random Post: