ఒక్క క్షణం అంటున్న మెగా హీరో

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు వీఐ ఆనంద్. అటు శ్రీరస్తు శుభమస్తు సినిమాతో అల్లు శిరీశ్ కూడా హిట్ కొట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీకి “ఒక్క క్షణం” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన తగారు సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు అల్లు శిరీష్. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో మాట్లాడిన శిరీష్.. తన సినిమా టైటిల్ ను బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో నడుస్తోంది. అల్లు శిరీష్, సీరత్ కపూర్, కమెడియన్ ప్రవీణ్ మధ్య కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.

ఒక్క క్షణం సినిమాలో అల్లు శిరీశ్ సరసన సీరత్ కపూర్ తో పాటు మరో హీరోయిన్ గా సురభి నటిస్తోంది. కీలకపాత్రలో అవసరాల శ్రీనివాస్ కనిపిస్తాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.


Recent Random Post: