కమ్ముల కుబేర.. వచ్చేది ఎప్పుడు?

టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చివరిగా లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది. దీని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ధనుష్ హీరోగా కుబేర మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున మరో హీరోగా కనిపించబోతున్నారు. అయితే ఆయన పాత్ర ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ ఫైనల్ దశకు చేరుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కుబేర మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ఈసారి శేఖర్ కమ్ముల ప్రేమకథని కాకుండా ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్పబోతున్నట్లు స్పష్టమైంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఏషియన్ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండడం విశేషం. నిజానికి మూవీ రిలీజ్ ఈ ఏడాదిలోనే చేయాలని చిత్ర యూనిట్ బలంగా అనుకుంటుంది.

కుబేర మూవీని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని భావిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తోంది. ఒకవేళ పుష్ప ది రూల్ మూవీ వాయిదా పడితే అదే డేట్ కి కుబేర సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

డిసెంబర్ లో రిలీజ్ సాధ్యం కాకపోతే 2025 సమ్మర్ హాలిడేస్ కి కుబేర ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉందంట. శేఖర్ కమ్ముల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కుబేర సినిమాని చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పటి వరకు తాను ఫాలో అయిన లైన్ నుంచి శేఖర్ కమ్ముల బయటికి వచ్చి కొత్త కథాంశంతో కుబేర సినిమాని చేస్తున్నారు.

శేఖర్ కమ్ముల సినిమాలు అంటే కథలు కంటే క్యారెక్టర్స్ జర్నీ బలంగా ఉంటుంది. పాత్రల భావోద్వేగాలు, వాటి ప్రయాణంలోనే బలమైన ఎమోషన్ ని పండించడం ఆయన నిజం. ఎమోషనల్ డ్రామా తోనే శేఖర్ కమ్ముల ఎక్కువ సక్సెస్ లు అందుకుంటూ వచ్చారు. కుబేర సినిమాలో కూడా అట్లాంటి స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామాని క్యారెక్టర్స్ తో నడిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత రానాతో లీడర్ మూవీ సీక్వెల్ చేసే ఛాన్స్ ఉందంట.