కొత్త దేశాల్లో అడుగుపెట్టిన రాజుగారు

బాహుబలి-2తో టాలీవుడ్ మార్కెట్ విస్తరించింది. అస్సలు పరిచయం లేని దేశాల్లో కూడా తెలుగు సినిమాను మార్కెట్ చేయడం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాజుగారి గది-2 సినిమాను కూడా కొత్తకొత్త దేశాల్లో రిలీజ్ చేశారు. కెన్యా, ఉగాండా, టాంజానియా లాంటి ఆఫ్రికన్ దేశాలతో పాటు.. స్వీడన్, డెన్మార్క్, కజకిస్థాన్, కిర్గిస్థాన్ లాంటి దేశాల్ని కూడా విడిచిపెట్టలేదు.

కనీసం 2వేల మంది తెలుగు ఆడియన్స్ ఉంటే చాలు రాజుగారి గది-2 ఆ దేశంలో విడుదలైంది. సో… ప్రపంచవ్యాప్తంగా రాజుగారి గది-2కు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్తకొత్త దేశాలతో పాటు దాదాపు 7 అరబ్ కంట్రీస్ లో కూడా ఈ మూవీ విడుదలైంది.

విడుదలకు ముందే రెవెన్యూ పరంగా సేఫ్ జోన్ లోకి చేరుకున్న రాజుగారి గది-2 సినిమాకు.. ఇలా వివిధ దేశాల్లో విడుదలవ్వడం అదనపు అడ్వాంటేజీ కానుంది. శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ ద్వారా ఈ సినిమాకు అటుఇటుగా ఇప్పటికే 10కోట్ల రూపాయలు వచ్చేశాయి. ఈస్ట్, వెస్ట్, గుంటూరు, సీడెడ్ మంచి రేట్లకు అమ్ముడుపోయాయి.

ఈ సినిమాకు నాగ్, ఓంకార్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. వచ్చిన ప్రాఫిట్ లోంచి షేర్ తీసుకునే ఒప్పందం మీద సినిమా చేశారు. సో.. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వీళ్లిద్దరికీ ఈసారి బాగానే గిట్టుబాటయ్యే ఛాన్స్ ఉంది.


Recent Random Post: