కొరటాల శివతో నాకు అస్సలు సంబంధం లేదు

ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా హీరో నాని. అవును.. కొరటాల శివకు తనకు మధ్య పెద్దగా దోస్తీ లేదని అంటున్నాడు. నాని ఇలా ప్రత్యేకంగా కొరటాల గురించి మాట్లాడ్డం వెనక ఓ రీజన్ ఉంది. ఈ దర్శకుడితో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడంటూ నానిపై ఈమధ్య ఓ ప్రచారం జరిగింది. దీనిపై స్పందిస్తూ నాని ఇలా రియాక్ట్ అయ్యాడు.

“నిన్న కోరి సినిమా టైమ్ లో కొరటాల గారిని ఓసారి కలిశాను. అంతే, ఆ తర్వాత మళ్లీ మేమిద్దరం కలుసుకోలేదు. అతడితో సినిమా ప్రపోజల్ కూడా లేదు. ఆ కోణంలో నన్ను ఎవరూ సంప్రదించ లేదు. కొరటాల, నేను కలిసి సినిమా చేయబోతున్నామనే విషయాన్ని నేను కూడా మీడియాలో చదివి తెలుసుకున్నాను. ఆ వార్తలో నిజం లేదు.”

ఈరోజు నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు నాని. ఈ సినిమా మాత్రమే తన చేతిలో ఉందని, 4-5కథలపై సైమల్టేనియస్ గా డిస్కషన్లు జరుగుతున్నాయని, ఏ సినిమా ముందు సెట్స్ పైకి వస్తుందో చెప్పలేనని అంటున్నాడు నాని.


Recent Random Post: