గ్రేట్ ఉపాస‌నా.. ఇలా ఎవ‌రైనా చేస్తారా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు కాబోయే భార్య‌గా ఉపాస‌న‌ను తొలిసారి చూసిన‌పుడు నెటిజ‌న్లు చాలామంది నెగెటివ్ కామెంట్లు చేశారు. పెళ్లికి ముందు, త‌ర్వాత ఆమె లుక్స్ గురించి సోష‌ల్ మీడియాలో ఎన్నో కామెంట్లు కూడా ప‌డ్డాయి. కానీ అలాంటి వాళ్లంద‌రూ త‌ర్వాతి కాలం త‌మ వ్యాఖ్య‌ల‌కు చింతించేలా చేసింది ఉపాస‌న.

స‌క్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమ‌న్‌గా పేరు తెచ్చుకోవ‌డం ఒకెత్త‌యితే.. ఎన్నో సామాజిక కార్య‌క్ర‌మాల ద్వారా అభాగ్యుల‌కు సాయం చేస్తూ, జ‌నాల్లో అవ‌గాహ‌న పెంచుతూ.. త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుందామె. సోష‌ల్ మీడియాలో ఉపాస‌న పెట్టే చాలా పోస్టుల్లో ప్ర‌జా ప్ర‌యోజ‌నం ముడిప‌డి ఉంటుంది. ప్ర‌స్తుతం సినీ కార్మికుల కోసం త‌మ కుటుంబానికి చెందిన అపోలో మెడిక‌ల్స్ నుంచి ఉచితంగా మందులిప్పించ‌డ‌మే కాక‌.. మ‌రిన్ని సేవా కార్య‌క్ర‌మాలు చేస్తోందామె.

ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియా ద్వారా జ‌నాల్లో అనేక విష‌యాల‌పై అవ‌గాహన పెంచే ప్ర‌య‌త్నం ప్ర‌యత్నం చేసే ఉపాస‌న‌.. తాజాగా ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది. వెస్ట్ర‌న్ స్టైల్ టాయిలెట్ల వ‌ల్ల అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని.. ఇండియ‌న్ టాయిలెట్లు చాలా ఉత్త‌మ‌మ‌ని జ‌నాల‌కు సందేశం ఇవ్వాల‌నుకున్న ఉపాస‌న‌.. అందుకోసం ఒక ఫొటో షూట్ చేసింది. ఇండియ‌న్ స్టైల్ టాయిలెట్ల‌ను ఉప‌యోగించాలంటూ ఆమె వాటిని వినియోగిస్తున్న త‌ర‌హాలో ఫొటోల‌కు పోజులివ్వ‌డం గ‌మ‌నార్హం.

సెల‌బ్రెటీలెవ‌రైనా ఇలాంటివి చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారా? తాము ఏవైనా యాడ్స్ చేసినా.. సౌంద‌ర్య సాధ‌నాలు, ఆహార ఉత్ప‌త్తులకు సంబంధించిన వాటినే ఎంచుకుంటారు. అలాంటిది వాళ్లంద‌రికీ భిన్నంగా.. జ‌నాలకు ఓ ముఖ్య సందేశం ఇవ్వాల‌ని ఇలాంటి ప్ర‌చారాన్ని ఎంచుకున్న ఉపాస‌న గ్రేట్ క‌దా!


Recent Random Post: