చరణ్‌కి సమంత డెడ్‌లైన్‌

చరణ్‌, సుకుమార్‌ల సినిమా షూటింగ్‌ ఇంతవరకు ప్లాన్‌ ప్రకారం జరగకపోవడంతో దసరా నాటికి సినిమా పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఆగస్ట్‌లోగా షూటింగ్‌ పూర్తి చేసేయాలని సమంత వీరికి షరతు విధించింది.

చైతన్య, సమంతల పెళ్లి అక్టోబర్‌ ప్రథమార్ధంలో జరగబోతోంది. అంటే ఆగస్ట్‌లోగా సమంత తన షూటింగ్స్‌ అన్నీ పూర్తి చేసుకోవాలి. పెళ్లి తర్వాత హనీమూన్‌ వగైరా వుంటాయి కనుక సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సమంత షూటింగ్స్‌ ఏమీ చేయదట. దీంతో చరణ్‌, సుకుమార్‌ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టులోగా పూర్తి చేసేయాలని సమంత డిసైడయింది. ఒకవేళ షూటింగ్‌ డిలే అయినట్టయితే సెప్టెంబర్‌లో డేట్స్‌ ఇవ్వలేనని కూడా చెప్పేసింది. జూన్‌ 1 నుంచి ఈ చిత్రాన్ని ఏకధాటిగా షూటింగ్‌ చేసి పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఎండలు, కొండలు అంటూ వాయిదా వేయడానికి లేకుండా సమంత ఈ మెలిక పెట్టింది. ఆగస్ట్‌లోగా హీరోయిన్‌ భాగాన్ని, పాటల చిత్రీకరణని పూర్తి చేసినట్టయితే, సెప్టెంబర్‌ నెలాఖరుకి సినిమా విడుదల చేసుకోవడానికి ఆటంకాలేమీ వుండవు. సమంత కారణంగా ఈ చిత్రం డిలే అవదని ఫాన్స్‌ కాన్ఫిడెంట్‌గా వుండొచ్చిక. అయితే చరణ్‌ సినిమా దసరాకి కన్‌ఫర్మ్‌ అయ్యే పక్షంలో ఆల్రెడీ అప్పటికి ఫిక్స్‌ అయిన సినిమాల షెడ్యూల్స్‌కి ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ సమస్యని ఎలా టాకిల్‌ చేస్తారనేది చూడాలిక.