చిన్నమ్మ శశికళ.. మళ్లీ వస్తోందా..? తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేప్ వైరల్ అవుతోంది. ‘మీరేం కంగారు పడకండి.. నేను వచ్చి పరిస్థితులను చక్కబెడతాను’ అని శశికళ అన్నట్టుగా వాయిస్ ఉంటే.. ‘మీ వెనకే మేమంతా ఉంటాం అమ్మా..’ అంటున్న కార్యకర్తలు మాటలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె మేనల్లుడు దినకరన్ వ్యక్తిగత సిబ్బంది ధ్రువీకరించడం.. శశికళ రాజకీయ అరంగేట్రం ఖాయమనే తెలుస్తోంది.

జయలలిత మరణం తర్వాత ఆమె అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి నాలుగేళ్లు జైలులో ఉన్నారు. అనంతరం.. గత ఫిబ్రవరి నెలలో విడుదలయ్యారు. అయితే.. సరిగ్గా ఎన్నికల ముందు మాత్రం తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు బహిరంగ లేఖ రాసి సంచలనం రేపారు. అయితే.. 2017లో జరిగిన పరిణామాలతో ఆమెను, దినకరన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈనేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారనే విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది.