చిరంజీవి పదే పదే పాజ్ చేసి వింటోన్న పాట ఇదే

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో మనందరం చూస్తున్నాం. తన సినిమాల గురించి అప్డేట్, తన కుటుంబ సభ్యుల పుట్టినరోజు వస్తే దానికి సంబంధించి ఎవరికీ తెలీని విశేషాలు, ఎవరిపైనైనా సెటైర్ వేయడం.. ఇలా రకరకాలుగా చిరంజీవి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. కరోనా చారిటీ పనులను కూడా సోషల్ మీడియా వేదికగానే నడిపిస్తున్నారు చిరు.

ఈ మధ్య కొంచెం కామ్ అయినట్లు అనిపించిన చిరు నిన్న సాంగ్ గురించి అప్డేట్ ఇస్తా అని అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా సాంగ్స్ షూట్ చేసేటప్పుడు వినడం నాకు చాలా ఇష్టం. అయితే మధ్యలో పాజ్ చేయడం నచ్చదు. కానీ ఈ మధ్యన ఒక సాంగ్ పాజ్ చేసి మరీ వింటున్నాను. అది నాకు ఎంతో నచ్చుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు చెబుతా అని చిరు అందరినీ సస్పెన్స్ లో ఉంచారు.

ఆ సాంగ్ ఏమై ఉంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కొందరేమో చిరు తన నెక్స్ట్ సినిమా ఆచార్యలో సాంగ్ గురించి అప్డేట్ ఇస్తారని అన్నారు.

ఈరోజు ఉదయం ఆ సాంగ్ గురించి రివీల్ చేసారు చిరు. ఖైదీ నెం 150లో యూ అండ్ మీ అనే సాంగ్ ను పాజ్ చేసి మరీ వింటున్నానని తెలిపారు. దీనికి కారణం తన మనవరాలు అని చిన్న వీడియోను కూడా పాజ్ చేసారు. అందులో ఆ చిన్న పిల్ల యూ అండ్ మీ సాంగ్ ను అడిగి మరీ పెట్టించుకుంటోంది. మధ్యలో పాజ్ చేస్తే ఏడుస్తోంది. ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ తాతయ్య చిరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అదీ విషయం.


Recent Random Post: