
ఒక సినిమాకి ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ఏమిటనేది తేలిపోయిన తర్వాత తిమ్మిని బమ్మిని చేయాలనుకోవడం దండగమారి వ్యవహారం. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘మెహబూబా’ చిత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురయిందనేది కలెక్షన్లే చెబుతున్నాయి. తొలి రోజే అంతంతమాత్రం వసూళ్లు తెచ్చుకున్న ఈ చిత్రానికి కనీసం మొదటి ఆదివారం నాడు అయినా చెప్పుకోతగ్గ వసూళ్లు రాలేదు. కొడుకుని హీరోగా నిలబెట్టడం కోసం పూరి జగన్నాథ్ ఈ చిత్రంపై భారీగా ఖర్చు పెట్టాడు. డెఫిసిట్‌లోనే దిల్ రాజుకి పన్నెండు కోట్లకి రైట్స్ అమ్మాడు. అయితే ఈ చిత్రం థియేటర్ల నుంచి కనీసం మూడు కోట్లు అయినా రికవర్ చేస్తుందా అనేది అనుమానంగా వుంది.
బాక్సాఫీస్ పరంగా మెహబూబా ఇంతటి దారుణమైన కష్టాలు పడుతోంటే ఈ చిత్రం చాలా బాగుందని నమ్మించడానికి ఛార్మి అష్టకష్టాలు పడుతోంది. పట్టుమని వంద ఓట్లు కూడా పోల్ అవని ఐఎండిబి పేజ్ తెచ్చి దీనికి అంతర్జాతీయంగా అదిరిపోయే రేటింగ్ వచ్చిందని ఛార్మి చెప్పుకుంటోంది. అసలు ఐఎండిబిలో పబ్లిక్ ఓటింగే తప్ప వాళ్లు రేటింగ్ ఇవ్వరు. మెహబూబా టీమ్ అంతా ఓట్లేసినా కానీ వంద ఓట్ల కంటే ఎక్కువే వుండాలి. ఇక రీట్వీట్ల కోసమని సెలబ్రిటీలకి బిస్కెట్లు వేసే వాళ్ల ట్వీట్లని ఛార్మితో పాటు పూరి కూడా ట్వీట్ చేస్తుండడం హాస్యాస్పదంగా వుంది. పబ్లిక్ టాక్ వీడియోల గురించి అయితే చెప్పుకోవడం కూడా దండగే. సినిమాని నిలబెట్టే ప్రమోషన్లు వదిలేసి ఇలాంటి వాటితో ఏమి చేద్దామని ఛార్మి అండ్ పూరీ కనక్ట్స్ ట్రై చేస్తున్నారనేది వారికే తెలియాలి.
Recent Random Post: