
తెలుగుదేశం పార్టీకి రేవంత్‌రెడ్డి గుడ్ బై చెప్పేశారు. తెలంగాణలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ అసెంబ్లీలో టీడీఎల్పీ లీడర్‌గా, కొడంగ్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రేవంత్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖను ‘పంపారు’. అయితే, ఇంకా తనకు రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ అందలేదని చంద్రబాబు ప్రకటించడం గమనార్హం.
ఏం చేసినా, తెలంగాణలో టీడీపీని ముందుకు నడిపించలేని పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపినట్లు గాసిప్స్ రావడం, మరోపక్క రేవంత్‌రెడ్డిని ఎప్పుడెప్పుడు టీడీపీ నుంచి బయటకు పంపేద్దామా? అని ఎదురుచూస్తోన్న తెలంగాణ టీడీపీ నేతలు సమయం చూసి, రేవంత్‌రెడ్డి మీద ‘రాజకీయం’ షురూ చేయడం.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో చంద్రబాబు ‘ప్రేక్షక పాత్ర’ పోషించడం తెల్సిన విషయాలే.
పార్టీ నుంచి రేవంత్‌రెడ్డిని బయటకు పంపేముందు ‘చంద్రబాబు మార్కు అవమానాలు’ చాలానే ‘బహుమతి’గా లభించేశాయి రేవంత్‌రెడ్డికి. అయినా, అధినేతను కలిసి ‘మొరపెట్టుకుందామనుకున్న’ రేవంత్‌రెడ్డిని, టీడీపీ అనుకూల మీడియా అస్సలేమాత్రం వదిలిపెట్టలేదు. నిన్న హైద్రాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అయిన రేవంత్‌రెడ్డి, ఈ రోజు ఇంకోసారి చంద్రబాబుని అమరావతిలో కలిశారు. రేవంత్ సహా తెలంగాణ టీడీపీ నేతలంతా చంద్రబాబుని కలిసినా, రేవంత్‌ని పూర్తిగా పక్కన పెట్టేశారంతా.
ఇక, అవమానాలు భరించలేక చంద్రబాబుని వ్యక్తిగతంగా కలిసే అవకాశాన్ని కూడా లైట్ తీసుకుని, రాజీనామా లేఖని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి రేవంత్‌రెడ్డి అందించినట్లు తెలుస్తోంది. రేవంత్, టీడీపీని వీడడం ఖరారైపోయింది. ఆయన రేపు సొంత నియోజకవర్గంలో అనుచరులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తారు.
రేవంత్, టీడీపీకి గుడ్ బై చెప్పేశారు సరే.. లిస్ట్‌లో నెక్స్‌ట్ ఎవరున్నారబా.? ఇంకెవరు, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే మిగిలారు. రేవంత్‌తోపాటుగా ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా వున్నారు సండ్ర వెంకట వీరయ్య. ఆ లెక్కన, నెక్స్‌ట్ వికెట్ సండ్ర వెంకట వీరయ్యదే కావొచ్చు. ఇక, ఆర్.కృష్ణయ్య పేరుకి టీడీపీ ఎమ్మెల్యే అయినా, ఆయన టీడీపీతో కలిసి వుంటోన్న సందర్భాలు చాలా చాలా తక్కువ. సో, తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోయినట్లుగానే భావించాలి.
Recent Random Post:

















