తమిళ సూపర్ స్టార్ తెలుగు డెబ్యూకు అదిరిపోయే రెమ్యునరేషన్

తమిళ స్టార్ హీరో విజయ్ ఎప్పటినుండో డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి చెప్పిన కథ విజయ్ కు నచ్చడం వెంటనే పచ్చ జెండా ఊపడం జరిగిపోయాయి. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. విజయ్ ప్రస్తుతం చేస్తోన్న చిత్రం పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కుతుంది.

ఇక ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చిత్రం ద్వారా విజయ్ 90 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడట. విజయ్ ఒక్కడికే అంత మొత్తం అంటే సినిమా బడ్జెట్ కచ్చితంగా 200 కోట్లను దాటిపోతుంది.

దిల్ రాజు అంటే లెక్కల్లో పక్కాగా ఉంటాడు. అనవసరం అనుకుంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చుపెట్టడు. అలాంటిది మరి ఈ ప్రాజెక్ట్ కోసం అంత ఖర్చు చేస్తాడా అన్నది చూడాలి. అందులోనూ వంశీ పైడిపల్లి కెరీర్ లో కాస్ట్ ఫెయిల్యూర్స్ అయిన చిత్రాలు ఎక్కువ ఉన్నాయి.