దృశ్యం 2 తమిళ రీమేక్ కు కాస్టింగ్ ఇబ్బందులు

థ్రిల్లర్ జోనర్ కు ఫ్యామిలీ ఎలిమెంట్ ను మిక్స్ చేసిన సినిమాలు చాలా అరుదు. అందులో టాప్ స్థాయిలో నిలిచే చిత్రం దృశ్యం. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ రీమేక్ అయింది. తెలుగులో వెంకటేష్ ఈ చిత్రాన్ని చేయగా, తమిళ్ లో కమల్ హాసన్ నటించాడు.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ దృశ్యం 2 కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ షూటింగ్ అప్పుడే పూర్తయింది కూడా. అయితే తమిళ్ రీమేక్ విషయంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.

కమల్ హాసన్, గౌతమి జంటగా దృశ్యం రీమేక్ లో నటించారు. పాపనాశం పేరుతో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఆరేళ్ళ క్రితం కమల్, గౌతమి లివిన్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. దీంతో కమల్ హాసన్ సీక్వెల్ లో హీరోయిన్ ను మార్చమని అడుగుతున్నాడట.