నందమూరి విబేధాలను బయటపెట్టిన ‘ఎన్టీఆర్’

ఒకవైపు ఎన్టీఆర్‌నేమో విశ్వవిఖ్యాతగా అభివర్ణిస్తారు. ఎన్టీఆర్ ఆఖర్లో ఆక్రోశించింది సొంతవాళ్లు చేసిన మోసంతోనే. అల్లుడిని ఔరంగజేబుతో పోల్చి, గుండె పగిలేలా బాధపడ్డారు ఎన్టీఆర్. సొంతవాళ్లంతా కలిసి చేసిన అన్యాయంతో, మోసపోయాను అనే బాధతో ఆయన ప్రాణమే పోయింది. ఆ తర్వాత అవసరానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ పేరును, ఫొటోలను ఇష్టానుసారం వాడుకున్నారు.ఎన్టీఆర్‌కు నైతిక విలువల్లేవు అన్న నోళ్లతోనే ఆయనకు భారతరత్న ఇవ్వాలని నినదించేంత వరకూ వచ్చారు, అది నినాదంగానే మిగిలిపోయిందనుకోండి. ఆ సంగతలా ఉంటే ఇప్పుడు నందమూరి కుటుంబమే రూపొందిస్తున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో ఏం చూపుతారో కానీ, ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నందమూరి కుటుంబంలోని విబేధాలను బయటపెట్టింది.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ వారసులెవరూ సరిగా రాలేదు. ఎన్టీఆర్ పేరును వాడుకొంటూ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి రాలేదు. కుటుంబం అంతా కలిసి సెలబ్రేషన్ లా ఈ సినిమాను ప్రారంభిస్తుంది అనుకుంటే.. బాబు మొహం చాటేశాడు. ఈ సినిమాను రూపొందిస్తున్నది తన బామ్మర్ధి కమ్ వియ్యంకుడు కమ్ టీడీపీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ బాబు రాలేదు.దీనికంతా కారణం పురందేశ్వరి లాంటి వాళ్లు అక్కడకు వస్తారనే అని సమాచారం. ఎన్టీఆర్ పేరును చెప్పుకుని బయట తిరుగుతారు కానీ.. వాళ్ల కుటుంబంలోని వారెవరూ మొహం మొహం చూసుకునే పరిస్థితి లేదని టాక్. ఇక భువనేశ్వరికి ఎంతైనా తండ్రి సినిమా, తమ్ముడు తీస్తున్నాడు కాబట్టి వచ్చినట్టుగా ఉన్నారు. చంద్రబాబు మాత్రం పిచ్చ లైట్ తీసుకున్నాడు. లోకేష్ కూడా రాలేదు. ఎన్టీఆర్ మనవడిని అని చెప్పుకుంటాడితను. అయినప్పటికీ రాలేదు పాపం.

పిలిచినా పెదబాబు, చినబాబులు రాలేదు, ఇక చిన్న ఎన్టీఆర్ ను అయితే పిలిచారోలేదో ఎవరికీ తెలీదు. అతడు రాలేదనేది మాత్రం వాస్తవం. తెలుగుదేశం పార్టీ అవసరాలను బట్టి జూనియర్‌తో నందమూరి కుటుంబం డీల్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అధికారం చేతిలో ఉంది కాబట్టి అతడి అవసరం లేదు. అందుకే అతడిని పిలిచిందే లేదని సమాచారం. పిలిచి ఉండినా, పిలవకపోయినా అతడైతే రాలేదు.

దీంతో నందమూరి కుటుంబంలో పరిస్థితి ఏమిటో స్ఫష్టంగానే అర్థం అవుతోంది. ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది, ఆయన్ను వ్యథకు గురిచేసింది కుటుంబమే.. ఇప్పుడు మళ్లీ ఆయన జీవితగాథను తెరకెక్కించి సందేశం ఇస్తున్నారో చూసుకోండిక!


Recent Random Post: