పరిటాల సునీతగా రమ్యకృష్ణ?

MLA Paritala Sunitha watches NBK Lion Movie Photos

లైవ్ క్యారెక్టర్ల హడావుడి నడుస్తోంది టాలీవుడ్ లో. ఈ లైన్ లోనే త్వరలో రాబోయే ఓ సినిమాలో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ, ప్రస్తుత మంత్రి పరిటాల సునీత పాత్రలో కనిపించబోతోందని గ్యాసిప్ గుప్పుమంటోంది. అయితే అలా అని చెప్పి ఎవరూ ఏ బయోపిక్ తీయడంలేదు. రాయలసీమ తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి క్యారెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకుని, అల్లుకున్న ఓ కథలో రమ్యకృష్ణ అతని భార్య పాత్ర పోషిస్తోంది.

హీరో నారా రోహిత్ బాలకృష్ణుడు అనే సినిమా చేస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ వ్యవహారాల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఈ కథ దాదాపుగా పరిటాల రవి కథలా వుంటుందని తెలుస్తోంది. పరిటాల రవిని కిడ్నాప్ చేస్తే, ఆయన భార్యగా సునీత ఎలా స్పందించి, ఎలా పోరాడారన్నది, అసలు పరిటాల రవి లాంటి క్యారెక్టర్ ను ఎందుకు కిడ్నాప్ చేసారన్నది మరో పాయింట్ అని తెలుస్తోంది.

ఇంతకీ కిడ్నాపర్ గా హీరో నారా రోహిత్ నే చేయడం విశేషం. మరి పక్కా ఫిక్షన్ అయినా, సినిమా చూస్తే పరిటాల ఫ్యామిలీ గుర్తుకువస్తుందని అంటున్నారు. అంటే మొత్తంమీద రమ్యకృష్ణకు మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ దొరికిందన్నమాట.


Recent Random Post: