పవన్ తో తొలి అనుభవం: వెరీ రొమాంటిక్

టాలీవుడ్ కు వచ్చిన ఏ హీరోయిన్ అయినా పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుంది కాబట్టి. అలా ఈమధ్య కాలంలో ఉన్నఫలంగా క్రేజ్ తెచ్చుకున్న భామ అను ఎమ్మాన్యుయేల్. ప్రస్తుతం పవన్ తో ఓ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అతనితో తన తొలి అనుభవాన్ని మీడియాతో పంచుకుంది.

“పవన్ తో ఫస్ట్ డే షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డాను. షెడ్యూల్ లో మొదటి రోజే నాకు షూటింగ్ పెట్టారు. అది కూడా పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో సీన్. అది కూడా మామూలు సీన్ కాదు. పవన్ కు నాకు మధ్య రొమాంటిక్ సన్నివేశమది. అప్పటికే నేను నా డైలాగ్స్ ను 2-3సార్లు బట్టీపట్టాను. కానీ పవన్ ఫేస్ చూసిన ప్రతిసారి డైలాగ్స్ మరిచిపోయేదాన్ని.”

అలా తొలిరోజు పవన్ తో గడిపిన క్షణాల్ని గుర్తుచేసుకుంది అను ఎమ్మాన్యుయేల్. ప్రస్తుతం ఇదే సినిమాలో నటించేందుకు బల్గేరియా వెళ్లిన ఈ భామ.. పవన్ బాగా జోకులేస్తాడని అంటోంది. ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతారని, ఎంతో నిజాయితీగా ఉంటారని చెబుతోంది.


Recent Random Post: