పాపం మెహ్రీన్.. అన్ని సీన్లు కట్

Mehreen, Sundeep @ C/O Surya Movie Press Meet Images

ప్రాధాన్యం లేని కథలు ఎంచుకుంటే ఇలానే ఉంటుంది. కేరాఫ్ సూర్య సినిమాలో మెహ్రీన్ కు అస్సలు ఇంపార్టెన్స్ లేదు. ఆమె పోర్షన్ మొత్తం కట్ చేసి చూసినా సినిమాలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ వరకు అంతా ఇదే ఫీల్ అయ్యారు. ఇప్పుడు మేకర్స్ కూడా అదే ఫీల్ అయ్యారు.

సినిమాలో మెహ్రీన్ ఉన్న సన్నివేశాల్ని దాదాపు కట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఫస్టాఫ్ లో బోర్ కొట్టిన సన్నివేశాల్ని 20నిమిషాల వరకు తొలిగించినట్టు దర్శకుడు సుశీంద్రన్ తెలిపాడు. వీటిలో అధిక భాగం మెహ్రీన్ నటించినవే. పాపం మెహ్రీన్.. సినిమాలో కనిపించిందే చాలా తక్కువ. ఆ సీన్లు కూడా ఇప్పుడు లేపేస్తున్నారు.

కోలీవుడ్ లో ఈ ట్రిమ్మింగ్ కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. తమిళ్ వెర్షన్ లో మెహ్రీన్ అతిథి పాత్రలా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. రేపోమాపో తెలుగు వెర్షన్ నుంచి కూడా ఆమె మాయమౌతుంది.

కాకపోతే ఈ ట్రిమ్మింగ్ పనులు సినిమాకు పెద్దగా కలిసొచ్చేలా లేవు. ఎందుకంటే ఒకసారి టాక్ బయటకొచ్చిన తర్వాత మళ్లీ ఆ సినిమా వైపు చూడ్డానికి ప్రేక్షకుడు ఇష్టపడడు. మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత బోరింగ్ సన్నివేశాలు తీసేయడం అనే కాన్సెప్ట్ మంచి ఫలితాలివ్వలేదు