
ఈ బంధం ధృఢమైనది.. అన్నట్లుగా వుంది కదూ ఈ ఫొటో. ఇందులో కనిపిస్తున్నది ఉపాసన, బ్రాహ్మణి. ఒకరేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోడలు బ్రాహ్మణి కాగా, ఇంకొకరేమో సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కోడలు ఉపాసన. బ్రాహ్మణి – నందమూరి బాలయ్య గారాల పట్టి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
నంది అవార్డులకు సంబంధించి మెగా – నందమూరి ‘క్యాంప్’ల మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. నంది పురస్కారాల్లో మెగా క్యాంప్‌కి అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఈ టైమ్‌లో బాలయ్య కుమార్తె, చిరంజీవి కోడలు.. ఒకే ఫొటోలో.. అదీ ‘మా బంధం దృఢమైనది..’ అన్నట్లుగా కన్పించడం విశేషమే మరి.
ఇక, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతున్నారు. హెరిటేజ్ సంస్థ కార్యకలాపాల్ని ఆమె స్వయంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. మరోపక్క, చరణ్ సతీమణి ఉపాసన అపోలో ఆసుపత్రికి సంబంధించి వ్యవహారాలు చూసుకుంటున్నారు. హెల్త్ రంగానికి సంబంధించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆమె రాణిస్తున్నారు. ఇద్దరు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్.. ‘రక్తదానం’పై అవగాహన కల్పించేందుకు.. ఇదిగో ఇలా ఫొటోలో కన్పించారు. అదీ అసలు సంగతి.
Recent Random Post:

















