పిక్‌ టాక్‌: సౌత్‌ క్వీన్స్‌ – వన్‌ టూ త్రీ ఫోర్‌.!

బాలీవుడ్‌ మూవీ ‘క్వీన్‌’ని తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి రీమేక్‌ చేస్తోన్న విషయం విదితమే. కంగనా రనౌత్‌ నటించిన ‘క్వీన్‌’ బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో, ఆ సినిమాని సౌత్‌లోకి రీమేక్‌ చేస్తున్నారు. మొదట, ఒకే హీరోయిన్‌తో సౌత్‌లో నాలుగు భాషల్లోనూ రీమేక్‌ చేసేద్దామనుకున్నా, ఆ తర్వాత ఆలోచనలు మారిపోయాయి.

తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్‌ అగర్వాల్‌, కన్నడలో పారుల్‌ యాదవ్‌, మలయాళంలో మంజిమ మోహన్‌ ప్రధాన పాత్రల్లో ‘క్వీన్‌’ రీమేక్స్‌ తెరకెక్కుతున్నాయి. ఒక్కో భాషలో ఒక్కో పేరుతో ‘క్వీన్‌’ని రీమేక్‌ చేస్తుండడం గమనార్హం. తెలుగులో మాత్రం టైటిల్‌ని ‘క్వీన్‌’గానే వుంచారు. తమిళంలో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ పేరుతో తెరకెక్కిస్తోంటే, కన్నడలో ‘బటర్‌ ఫ్లై’ పేరుతోనూ, మలయాళంలో ‘జామ్‌ జామ్‌’ పేరుతోనూ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్‌ ఫ్రాన్స్‌లో జరుగుతోంది.

ఒకేసారి నలుగురు క్వీన్స్‌ ఈ రోజు సోషల్‌ మీడియా లైవ్‌ ద్వారా అభిమానుల ముందుకొచ్చారు. తమన్నా, మిగతా ముగ్గురు క్వీన్స్‌తో వున్న ఫొటోని ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. పారుల్ తప్ప, మిగతా క్వీన్స్ అందరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. తమన్నా, కాజల్ తెలుగులో స్టార్ హీరోయన్స్ కాగా, మంజిమ మాత్రం ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించింది. అదే ‘సాహసం శ్వాసగా సాగిపో‘.


Recent Random Post: